కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు డ్రామాలాడుతున్నాయి

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు డ్రామాలాడుతున్నాయి

ఖమ్మం: వడ్లు కొనుగోలు చేయకుండా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు డ్రామాలాడుతున్నాయని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క మండిపడ్డారు. జిల్లాలోని చింతకాని మండలంలో భట్టి విక్రమార్క చేపట్టిన పాదయాత్ర 13వ రోజుకు చేరుకుంది. ఈ సందర్భంగా ప్రొద్దుటూర్ లో ఆయన మాట్లాడుతూ... వడ్లు కొనకుండా ఈ డ్రామాలేందని ప్రశ్నించారు. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో రైతులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా వడ్ల కొనుగోలు జరిగేదన్నారు. కానీ నేడు రాష్ట్రంలో ఆ పరిస్థితి లేదన్నారు. వరి వేస్తే ఉరి అని సాక్షాత్తు రాష్ట్ర ముఖ్యమంత్రే అనడం సిగ్గు చేటన్నారు. కేసీఆర్ ప్రభుత్వానికి చిత్త శుద్ధి ఉంటే కేంద్రంతో సంబంధంలేకుండా వడ్లు కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. లేకపోతే  కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మెడలు వంచైనా సరే రైతులకు మేలు చేస్తామని హామీ ఇచ్చారు.

మరిన్ని వార్తల కోసం...

వచ్చే ఎన్నికల కోసం అభ్యర్థులను ప్రకటించిన కోదండరాం

కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు డీఏ పెంపు